: అకాల వర్షానికి అతలాకుతలం
తెలంగాణలో గత రెండు రోజులుగా అక్కడక్కడా పడుతున్న వర్షాలు నేడు మరింతగా పెరిగాయి. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం 10 గంటల నుంచి భారీ వర్షం పడుతోంది. కొన్ని చోట్ల రహదారులపై రెండు నుంచి రెండున్నర అడుగుల మేర నీరు నిలవడంతో, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో వడగళ్ళ వాన పడడంతో మామిడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. పలు మార్కెట్ యార్డులలో అమ్మకానికి తెచ్చిన మిరప తదితర పంట నీటిలో కొట్టుకుపోయింది. వరంగల్ జిల్లాలో విద్యుత్ తీగలు తెగి దంపతులు మృతి చెందారు. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో వరి పంట దెబ్బతింది. కృష్ణా జిలాల్లో వర్షానికి నూజివీడు మామిడి రైతులు కుదేలయ్యారు. మాయదారి వర్షం తమకు తీవ్ర నష్టం కలిగించిందని రైతులు వాపోతున్నారు.