: మొబైల్ షాపింగ్ కు 'యాప్' అడ్డు!


ప్రతిష్ఠ... బెంగళూరుకు చెందిన గృహిణి. ఫ్లిప్ కార్ట్ మాధ్యమంగా ఆన్ లైన్ షాపింగ్ చేయాలని భావించి తన స్మార్ట్ ఫోన్ నుంచి వెబ్ సైటును తెరవాలని ప్రారంభించింది. ఫోన్ బ్రౌజరులో ఫ్లిప్ కార్ట్ సైటు ఓపెన్ కాలేదు. ఫ్లిప్ కార్ట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలన్న సూచన వచ్చింది. ఫోన్ లో చాలినంత స్టోరేజ్ లేకపోవడంతో, ఆమె అటువంటి ఉత్పత్తులను అమెజాన్ వెబ్ సైటు నుంచి కొనుగోలు చేసింది. ఈ సమస్య ప్రతిష్ఠ ఒక్కరిదే కాదు. మొబైల్ ఆధారిత షాపింగ్ చేయాలని భావిస్తున్న పలువురికి నిత్యమూ ఎదురయ్యేదే. స్మార్ట్ ఫోన్ల నుంచి ప్రోడక్టులు కొనుగోలు చేయాలంటే 'యాప్'లను డౌన్ లోడ్ చేసుకోవాలని, అప్పుడే ఆఫర్లు అందుతాయని సూచిస్తున్న ఈ-కామర్స్ సంస్థల సంఖ్య పెరుగుతోంది. ఈ 'యాప్'లు సుమారు 20 నుంచి 40 మెగా బైట్ల వరకూ స్టోరేజ్ ని ఆక్రమిస్తాయి. దీంతోపాటు ఇవి నిత్యమూ అప్ డేట్ అవుతాయి కాబట్టి డేటా కూడా ఎక్కువగానే ఖర్చవుతుంది. దీంతో వీటిని డౌన్ లోడ్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్ యూజర్లు వెనుకంజ వేస్తున్నారు. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లలో కేవలం 12 నుంచి 15 యాప్ లు మాత్రమే ఉంచుకునే వీలుంది. వీటిల్లో అధిక భాగం ఫేస్ బుక్, వాట్స్ యాప్, జి-మెయిలు, యాహూ, యాంగ్రీ బర్డ్స్, ట్రూ కాలర్, టెంపుల్ రన్, మెసింజర్, మ్యాప్స్ తదితరాలు తప్పనిసరి. ఇక తమకు నచ్చిన యాప్స్, గేమ్స్ లోడ్ చేసుకునేందుకే యూజర్లు ప్రాధాన్యం ఇస్తూ, ఈ- కామర్స్ సైట్ల యాప్ లపై అంతగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. సుమారు 12 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉన్న ఇండియా లో 10 కోట్ల మందికి పైగా నిత్యమూ నెట్ వాడుతున్నారు. అయితే, ఈ- కామర్స్ వాణిజ్యంలో మాత్రం మొబైల్ వాటా చాలా తక్కువగా ఉంది. యాప్ లు డౌన్ లోడ్ చేసుకోకుండా కంప్యూటర్ పైనే ఉత్పత్తులు కొనుగోలు చేయాలని అత్యధికులు భావిస్తున్నారు. అయితే, భవిష్యత్ లో మాత్రం పరిస్థితి మారుతుందని, అందువల్ల ఇప్పటినుంచే యాప్ లను అలవాటు చేసుకునే దిశగా కృషి చేస్తున్నామని ఈ- కామర్స్ సంస్థలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News