: మరింత త్వరగా గమ్యస్థానానికి... తగ్గనున్న విమాన ప్రయాణ సమయం
మెట్రో నగరాల మధ్య విమాన ప్రయాణ సమయాన్ని తగ్గించాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ దిశగా కొత్త వ్యవస్థకు రూపకల్పన చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవస్థను తొలుత ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా విమానాశ్రయాల్లో అమలు చేయాలని ఏఏఐ భావిస్తోంది. విమానాలు ఎయిర్ పోర్టులలో ఉండే సమయాన్ని కుదించాలని కూడా ఏఏఐ ప్రతిపాదనలు చేసింది. ఏటేటా పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్ కారణంగా అన్ని నావిగేషన్ సేవల్లో ఒత్తిడి పెరుగగా, పలు విమానాలు ఆలస్యంగా బయలుదేరుతూ ప్రయాణికుల సహనానికి పరీక్షలు పెడుతున్నాయి. కొత్తగా ప్రతిపాదిస్తున్న వ్యవస్థ అందుబాటులోకి వస్తే, ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్టుల నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రోడీకరించి సలహా, సూచనలు ఇచ్చే అవకాశం లభిస్తుంది.