: చైనా సరిహద్దుకు సమీపంలో భారత్ రైల్వే స్టేషన్


నిత్యం ఏదో ఒక విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు గట్టిగా సమాధానం చెప్పాలని భారత్ భావిస్తోంది. భారత్ సరిహద్దుల గుండా ఎవరెస్టు శిఖరం ఆనుకుని చైనా సొరంగ మార్గం నిర్మించాలని భావిస్తోందంటూ వార్తలు వెలువడిన వెంటనే భారత్ కూడా అలాంటి ప్రకటనే ఒకటి విడుదల చేసింది. చైనా సరిహద్దుకు అతి సమీపంలో ఉండే అరుణాచల్ ప్రదేశ్ లో ఓ రైల్వేస్టేషన్ నిర్మించనున్నామని భారత్ ప్రకటించింది. పరస్పర అవగాహనా ముసాయిదా ఒప్పందం సిద్ధమవుతోందని, దీనిపై రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో చర్చిస్తామని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు.

  • Loading...

More Telugu News