: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై...రివాజు మారింది


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాదుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ ఐపీఎల్ లో మొదట జరిగిన మూడు మ్యాచ్ లలో టాస్ గెలిచిన జట్లు ఛేజింగ్ ఎంచుకోగా, చెన్నై ఈ రివాజును మార్చింది. చెన్నైతో పోలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో పటిష్ఠంగా ఉంది. తొలి మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ను ఒక్క పరుగుతేడాతో ఓడించి ఊపు మీద ఉన్న 'ధోనీ అండ్ కో'ను సన్ రైజర్స్ అడ్డుకోగలదా? అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. ఇది మరో రెండు గంటల్లో తీరిపోనుంది.

  • Loading...

More Telugu News