: ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రజలకు ఆసక్తి లేదు: బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్య


రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రజలతో పాటు అన్ని రాజకీయపక్షాలు వాదిస్తుంటే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాత్రం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రజలకు ఆసక్తి లేదని ఆయన అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మీడియా కూడా ఈ విషయంపై మభ్యపెట్టే ధోరణినే అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదాపై ప్రజలకు ఆసక్తి లేని విషయాన్ని తన వెంట వస్తే నిరూపించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News