: ఎన్ కౌంటర్ బూటకం... ఎస్కార్ట్ పై కేసు పెట్టండి: ఆలేరు పీఎస్ లో వికార్ తండ్రి ఫిర్యాదు
ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్ బూటకమని, ఎన్ కౌంటర్ కు పాల్పడ్డ ఎస్కార్ట్ సిబ్బందిపై కేసులు నమోదు చేయాలని అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం నల్గొండ జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కూడా ఆయన తన ఫిర్యాదులో పోలీసులను కోరారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాదుకు తరలిస్తున్న క్రమంలో వరంగల్ జిల్లా జనగాం దాటిన తర్వాత నల్గొండ జిల్లా ఆలేరు సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో వికారుద్దీన్ తో పాటు అతడి నలుగురు అనుచరులు హతమైన సంగతి తెలిసిందే.