: హైదరాబాదులో భారీ అగ్ని ప్రమాదం... తగలబడిపోతున్న సెల్ టవర్ పరికరాలు
ఓ పక్క హైదరాబాదులోని మెజారిటీ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా, మరోవైపు నగరంలోని పెద్ద అంబర్ పేటలో కొద్దిసేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెల్ టవర్ల పరికరాలున్న ఓ గోడౌన్ లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గోడౌన్ లోని జనరేటర్లు, బ్యాటరీలు కాలిపోతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. జనరేటర్లు, బ్యాటరీలు దగ్ధమవుతున్న నేపథ్యంలో నష్టం భారీగా ఉండే ప్రమాదం లేకపోలేదు.