: కోవెల వీధిని కొల్లగొట్టిన చోరులు... నరసాపురంలో భారీ చోరీ!


పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో గత రాత్రి భారీ చోరీ జరిగింది. పట్టణంలోని కోవెల వీధిలో చోరులు స్వైర విహారం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంటిలోకి చొరబడ్డ చోర శిఖామణులు 60 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. తెల్లవారిన తర్వాత చూసుకున్న బాధిత కుటుంబం లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News