: వేద మంత్రాల మధ్య అమెరికా కాంగ్రెస్ సభ్యురాలి పెళ్లి!


భారత సంప్రదాయాల పట్ల విశ్వవ్యాప్తంగా ఆసక్తి నానాటికీ పెరిగిపోతోంది. వివిధ కారణాల వల్ల విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు దేశానికి తిరిగి రాలేకున్నా, తమ కుటుంబాల సంప్రదాయాలకు ఎంతమాత్రం దూరం జరగడం లేదు. నిన్న అమెరికాలో జరిగిన ఓ వివాహమే ఇందుకు నిదర్శనం. అమెరికా కాంగ్రెస్ లోకి తులసీ గబ్బార్డ్ తొలి హిందూ అమెరికన్ గా అడుగుపెట్టారు. ఇదివరకే ఓ వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె నిన్న సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్ ను పెళ్లి చేసుకున్నారు. హవాయ్ లోని చారిత్రక కహాలు చెరువు ప్రాంగణంలో ఈ వేడుక వేద మంత్రాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. భారత సంప్రదాయాల మధ్య జరిగిన ఈ వేడుకకు ఈ దేశ చట్టసభ సభ్యులు, గబ్బార్డ్ మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

  • Loading...

More Telugu News