: చంద్రబాబుతో వేదికెలా పంచుకుంటారు?: త్రిషపై తమిళ సంఘాల ఆగ్రహం


టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ప్రముఖ నటిగా వెలుగొందుతున్న త్రిషపై తమిళ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. అయినా ఆమె ఏం చేసిందనేగా మీ అనుమానం? ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో వేదిక పంచుకోవడమే ఆమె చేసిన నేరమట! చంద్రబాబుతో వేదిక పంచుకున్న త్రిష, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తమిళనాడుకు చెందిన హిందూ మక్కల్ కట్చి చెబుతోంది. అసలు విషయమేంటంటే, చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో ఏపీ పోలీసులు 20 మంది తమిళ కూలీలను చంపేశారు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ ఆందోళనలు కొనసాగుతుండగానే, బాలకృష్ణ నటించిన ‘లయన్’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రంలో హీరోయిన్ గా నటించిన త్రిష కూడా హాజరైంది. చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. విషయం తెలుసుకున్న తమిళ సంఘాలు, త్రిషను నిలదీశాయి. 20 మంది కూలీలు చనిపోయి తామంతా విషాదంలో మునిగిపోయి ఉంటే, ఆ 20 మంది చనిపోవడానికి కారణమైన చంద్రబాబుతో వేదిక ఎలా పంకుకుంటారంటూ ఆమెను ఆ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

  • Loading...

More Telugu News