: 301 ఉద్యోగాలకు 1.49 లక్షల అప్లికేషన్లు: తపాలా శాఖ ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ!
రాష్ట్ర విభజన తర్వాత కొత్త ఉద్యోగాల కోసం రెండు రాష్ట్రాల్లో నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఉద్యోగ ప్రకటనలపై ఏమాత్రం దృష్టి సారించడం లేదు. దీనిపై నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తపాలా శాఖ తెలుగు రాష్ట్రాల పరిధిలోని పోస్ట్ మన్, మెయిల్ గార్డుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 301 పోస్టుల భర్తీ కోసం వెలువడ్డ ఈ ప్రకటనకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 1.49 లక్షల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.