: ఇల్లినాయిస్ లో బీభత్సం సృష్టించిన టోర్నడోలు


పెనుగాలులు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. టోర్నడోలు అమెరికాలో బీభత్సం సృష్టించడం సర్వసాధారణం. టోర్నడోలకు భయపడే కాంక్రీటు నిర్మాణాల కంటే, చెక్క ఇళ్లు నిర్మించుకునేందుకు స్థానికులు మొగ్గుచూపుతారంటే, టోర్నడోల బీభత్సం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఫెయిర్ డేల్-3 అనే చిన్న నగరాన్ని భారీ టోర్నడో కుదిపేసింది. ఈ టోర్నడో ధాటికి నగరంలోని ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. టోర్నడో ధాటికి రోడ్డుపై వెళ్తున్న ట్రక్కు పడిపోయిందంటే గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. టోర్నడోల దాడిలో ఒక వ్యక్తి మృత్యువాతపడగా, పలువురు గాయపడ్డారు. కొన్ని ఇళ్లు కూలిపోయాయి.

  • Loading...

More Telugu News