: నాలుగోసారి దత్తత తీసుకోబోతున్న ఏంజెలినా జోలీ


హాలీవుడ్ నటి, దర్శకురాలు ఏంజెలినా జోలి సిరియా నుంచి ఓ చిన్నారిని దత్తత తీసుకోబోతోంది. ఇప్పటికే ఆమెకు ముగ్గురు దత్తత పిల్లలు, తనకు పుట్టిన మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరోసారి దత్తత చేసుకునే చిన్నారితో కలిపి ఏడుగురు పిల్లలవుతారు. ఐక్యరాజ్య సమితి అంబాసిడర్ గా ఉన్న జోలి పలుమార్లు సిరియాను సందర్శించింది. అక్కడి శరణార్ధుల శిబిరాల్లో పిల్లల పరిస్థితి చూసి జాలిపడింది. ఈ క్రమంలోనే శిబిరం నుంచి ఓ ఆడపిల్లను దత్తత తీసుకోవాలని అనుకుందట. అందుకోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్టు యూఎస్ వీక్లీ ఓ కథనంలో తెలిపింది. మొదట్లో దత్తత తీసుకున్న ఆ ముగ్గురినీ వివిధ అనాథాశ్రమాల నుంచి జోలీ తీసుకున్నారు. ఇప్పుడు కూడా వేరే ప్రాంతం నుంచి తీసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News