: హమ్మయ్య... ఇవాల్టికి గండం గడిచింది!


హైదరాబాదులో శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ తరువాత ప్రార్థనా మందిరాల వద్ద అల్లరిమూకలు రెచ్చిపోవచ్చని, ముఖ్యంగా శుక్రవారం నాడు అవాంచనీయ సంఘటనలు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడంతో, పోలీసులు నిన్నటి నుంచే విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దించి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో గత రాత్రంతా నిఘా పెట్టారు. ఈ ఉదయం నుంచే మసీదుల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ముఖ్యంగా అత్యంత సమస్యాత్మకమైన పాతబస్తీలోని మక్కా మసీదు వద్ద రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ ను రంగంలోకి దించారు. ప్రజలు గుమికూడి ఉండకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. అడుగడుగునా పికెట్‌లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలు ముగియడంతో హమ్మయ్య... ఇవాల్టికి గండం గడిచింది అనుకున్నారు పోలీసులు!

  • Loading...

More Telugu News