: ఎన్ కౌంటర్ పై విచారణకు ఆదేశించాం... పన్నీర్ సెల్వంకు చంద్రబాబు లేఖ
శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు లేఖ రాశారు. 20 మంది తమిళ కూలీలు మరణించిన సదరు ఎన్ కౌంటర్ పై విచారణకు ఆదేశాలు జారీ చేశామని ఆ లేఖలో చంద్రబాబు, తమిళ సీఎంకు తెలిపారు. విచారణ పూర్తి కాగానే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. శేషాచలం ఎన్ కౌంటర్ నేపథ్యంలో తమిళ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో నాలుగు రోజులుగా ఇరు రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా నిలిచిపోయింది.