: పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్ లో భారీ అగ్నిప్రమాదం... ఎగసిపడుతున్న అగ్నికీలలు
పశ్చిమ బెంగాల్ సచివాలయంలో కొద్దిసేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోల్ కతాలోని ఆ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలోని ఓ భవంతిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవంతిలోని ఎనిమిదో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లలో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.