: పసుపుపచ్చగా మారిన 'లయన్' ఆడియో వేడుక వేదిక
టాలీవుడ్ స్టార్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన 'లయన్' ఆడియో వేడుక హైదరాబాదులోని శిల్పకళావేదికలో ఆరంభమైంది. బాలయ్య సినిమా ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన టీడీపీ ప్రముఖ నేతలంతా హాజరయ్యారు. తెలుగు నేల చరిత్రను జగద్విదితం చేసిన ఎన్టీఆర్ నట వారసుడిగా రంగప్రవేశం చేసి, స్టార్ హీరోగా వెలుగొందుతున్న వైనాన్ని టీడీపీ నేతలంతా అభిమానులకు వివరించారు. 'లయన్' సినిమా సూపర్ హిట్టవ్వాలని అంతా ఆకాంక్షించారు. తమను ఆహ్వానించిన బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆడియో వేడుకలో మూడో పాటను ఆవిష్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం కేఈ బాలయ్యపై కవిత రాయడం విశేషం.