: మేమంతా అరకు వెళ్తున్నాం: కోడెల
తామంతా అరకు లోయకు విహార యాత్రకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ల సదస్సు విజయవంతంగా ముగిసిందని అన్నారు. సదస్సులో 8 అంశాలపై సమగ్రంగా చర్చించామని ఆయన చెప్పారు. సదస్సులో చర్చించిన అంశాలు అమలు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. 13 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు మొత్తం 30 మంది సభ్యులు సదస్సులో పాలుపంచుకున్నారని ఆయన చెప్పారు. సదస్సు విజయవంతమైన సందర్భంగా తామంతా అరకు విహారయాత్రకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.