: అదుపు తప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాహనం... కొద్దిలో తప్పిన ప్రమాదం
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు కొద్దిలో ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లా రామాయపేట మండలం కోనాపూర్ దగ్గర ఆయన వెళుతున్న కారుకు అడవి పంది ఎదురు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దాంతో కారు అదుపు తప్పడంతో ఎమ్మెల్యే సహా వాహనంలో ఉన్న మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే వారు దగ్గరి ఆసుపత్రిలో చేరగా వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు.