: ఐఎస్ఐఎస్ లో చేరి, సిరియాలో మరణించిన మహారాష్ట్ర జిహాదీ
ఇరాక్, సిరియా దేశాల్లో ఉగ్రతాండవం చేస్తున్న ఐఎస్ఐఎస్ లో చేరిన మహారాష్ట్ర నివాసి అబ్దుల్ రెహమాన్ సైన్యం దాడిలో మరణించాడు. అబ్దుల్ రెహమాన్ పవిత్ర యుద్ధంలో మరణించాడని, అతడిని అల్లా అక్కున చేర్చుకోవాలని కోరుకుంటున్నామని ఐఎస్ఐఎస్ ట్విట్టర్ ఖాతా వెల్లడించింది. మృతుడి చిత్రాన్ని పోస్ట్ చేసింది. దీంతో, ఐఎస్ఐఎస్ లో చేరిన భారతీయుల్లో ఇప్పటివరకూ ముగ్గురు మృత్యువాత పడ్డట్లయింది. ముస్లిం మతంలో సున్నీ వర్గానికి చెందిన ఐఎస్ఐఎస్ తమ వికృత చర్యలు, చేష్టలతో మారణహోమాన్ని సాగిస్తున్న సంగతి తెలిసిందే.