: పదేళ్లలో 6 వేల కేసులు...జైళ్లలో 70 మంది స్మగ్లర్లు: ఎన్ కౌంటర్ ను సమర్థించిన ఏపీ డీజీపీ
చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ ను ఏపీ డీజీపీ రాముడు సమర్థించారు. ఇందుకోసం ఆయన పదేళ్ల నాటి రికార్డులకు బూజు దులిపారు. ఏపీ పోలీసులు సాగించిన ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన వైనంపై అటు తమిళ వర్గాలతో పాటు ఏపీలోని విపక్షాలు, ప్రజా సంఘాలు కూడా నిరసన గళం విప్పాయి. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణలో భాగంగానే ఎన్ కౌంటర్ కు దిగాల్సి వచ్చిందన్న డీజీపీ, తన వాదనకు బలం చేకూర్చేందుకు పదేళ్లలో ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి నమోదైన కేసులను లెక్కగట్టి మరీ వెల్లడించారు. పదేళ్ల కాలంలో ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పిన రాముడు, ఇప్పటికీ జైళ్లలో 70 మంది స్మగ్లర్లు ఉన్నారని తెలిపారు.