: మహారాష్ట్ర ప్రభు త్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రచయిత శోభాడే ట్వీట్లు


మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి వ్యతిరేకంగా రచయిత, కాలమిస్టు శోభాడే అనుచితరీతిలో వ్యాఖ్యలు చేశారు. ముంబయిలోని మల్టీఫ్లెక్స్ థియేటర్లలో ప్రైమ్ టైమ్ లో తప్పనిసరిగా మరాఠీ చిత్రాలనే ప్రదర్శించాలంటూ తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకిస్తూ కొన్ని ట్వీట్టు చేశారు. "దేవేంద్ర 'దికత్ వాలా' ఫడ్నవీస్ మళ్లీ వ్యతిరేకించారు!!! బీఫ్ నిషేధం నుంచి సినిమాల వరకు. మేమంతా ప్రేమించే మహారాష్ట్ర ఇది కాదు. నకో! నకో! యే సబ్ రోకో!" అని శోభా ట్వీట్ చేశారు. మరోసారి "మరాఠీ చిత్రాలంటే నేను ప్రేమిస్తాను. వాటినెక్కడ, ఎప్పుడు చూడాలో నన్ను నిర్ణయించుకోనివ్వండి దేవేంద్ర ఫడ్నవీస్. ఇది దాదాగిరి కాదు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన ఎమ్మెల్యేలు ప్రతాప్ శర్నాయక్, సీఎం ఫడ్నవీస్ ను, మరాఠీ ప్రజల భావోద్వేగాలను అవమానపరచారంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో డేపై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. తన ట్వీట్లపై శోభా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని, లేకుంటే నోటీసుపై ముందుకెళతానని సేన ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా శోభాడేపై పలువురి నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News