: ఏపీ ప్రభుత్వానికి జాతీయ మనవ హక్కుల సంఘం నోటీసులు
నిన్న జరిగిన ఎర్ర చందనం దొంగల ఎన్ కౌంటర్ కేసులో జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్ సీ) స్పందించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వీటిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు ఈ నోటీసులు పంపింది. ఏ పరిస్థితుల్లో 20 మందిని చంపారో వివరించాలని సూచించింది. తేలికపాటి ఆయుధాలు తప్ప ప్రమాదకర తుపాకుల వంటి ఆయుధాలు లేనివారిని హెచ్చరికలతో అదుపులోకి తీసుకోకుండా కాల్పుల వరకూ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.