: తెలంగాణలో అమెజాన్ గిడ్డంగి
అంతర్జాతీయ స్థాయిలో ఈ కామర్స్ సేవలందిస్తున్న అమెజాన్ సంస్థ త్వరలో తెలంగాణలో కొత్త గిడ్డంగిని నిర్మించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, అమెజాన్ కు మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. నేడు హైదరాబాదుకు వచ్చిన సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను ప్రత్యేకంగా కలిశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు వద్ద అమెజాన్ వేర్ హౌస్ నిర్మించనుంది. దీని ద్వారా దక్షిణాది రాష్ట్రాల కస్టమర్లకు తమ ఉత్పత్తులను అందించనుంది.