: రిటైర్డ్ ఐపీఎస్ పై ఛీటింగ్ కేసు... మెడికల్ సీటు ఇప్పిస్తానని రూ.70 లక్షల వసూలు!


ఆయనో పేరు మోసిన పోలీసు అధికారి. ఐపీఎస్ పలు హోదాల్లో పనిచేసి అదనపు డీజీగా పదవీ విమరణ చేశారు. పోలీసైతేనేం, అక్రమ మార్గాల్లో డబ్బుల దందాకు తెర తీశాడు. చెప్పిన పని కాలేదు కదా, తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వండన్న బాధితులను చితకబాదాడు. దీనిపై ఫిర్యాదునందుకున్న పోలీసులు సదరు పోలీసు అధికారిపై ఛీటింగ్ కేసు పెట్టారు. వివరాల్లోకెళితే ఐపీఎస్ అధికారిగా వృత్తి జీవితం ప్రారంభించిన మదన్ లాల్ ఉమ్మడి రాష్ట్రంలో అదనపు డీజీగా పనిచేసి రిటైరయ్యారు. పోలీసు శాఖలో మంచి పలుకుబడి కలిగిన మదన్ లాల్, పదవీ విరమణ తర్వాత తన నకిలీ దందాకు తెరతీశాడు. మెడికల్ సీట్లిప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి వద్ద రూ.70 లక్షలు తీసుకున్నాడు. తీరా మెడికల్ సీటు రాకపోవడంతో డబ్బు వెనక్కు ఇవ్వాలన్న బాధితుడిని చితకబాదాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు మదన్ లాల్ పై 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News