: ఆంధ్రప్రదేశ్ బస్సులకు తమిళనాట నిప్పు పెట్టేందుకు ప్రయత్నం
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై తమిళనాడులో అగ్గిరాజుకుంది. ఉదయం ప్రారంభమైన ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ బస్సులపై దాడులు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బస్సుపై పెట్రోలు జల్లి నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు. ఇంతలో పోలీసులు రావడానికి తోడు, ప్రయాణికులు అప్రమత్తమవడంతో పెనుప్రమాదం తప్పింది. తమిళనాడు సరిహద్దుల్లో మాటువేసిన ఆందోళనకారులు ఏపీ బస్సులను అడ్డుకుని వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ లో ఆందోళనకారులు ఏపీ బస్సులను కదలనీయడం లేదు. దీని కారణంగా, పలు బస్సులు బస్టాండ్ కే పరిమితమయ్యాయి.