: పాకిస్థాన్ తో శ్రీలంక అణు ఒప్పందం
పాకిస్థాన్ తో శ్రీలంక అణుఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన మైత్రిపాల సిరిసేన పాక్ లో తొలిసారి పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమక్షంలో అణుఒప్పందంపై సంతకాలు చేసినట్టు 'ది ఎక్స్ ప్రస్ ట్రిబ్యూన్' అనే పత్రిక వెల్లడించింది. కాగా, ఈ ఒప్పందంపై ఇరు దేశాలు అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం. గత ఫిబ్రవరిలో భారత్ తో శ్రీలంక అణుఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఒప్పందంలో భాగంగా శ్రీలంకలో నిర్మించనున్న అణురియాక్టర్లలో పనిచేయబోయే సాంకేతిక సిబ్బందికి భారత ఇంజనీర్లు శిక్షణ ఇవ్వనున్నారు.