: గోవా దెబ్బతో కేరళలో 'ఆపరేషన్ డిగ్నిటి'!


గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణంలో దుస్తులు మార్చుకునే గదివైపు సీసీ కెమెరా ఉండటం, ఈ విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగడంతో, టూరిస్ట్ ఆదాయంపై ఎక్కువగా ఆధారపడ్డ మరో రాష్ట్రం కేరళ ముందుకు కదిలింది. కేరళ పోలీసులు అప్రమత్తమై 'ఆపరేషన్ డిగ్నిటి' పేరిట వస్త్ర దుకాణాల్లో సోదాలు జరుపుతున్నారు. ఎక్కడైనా రహస్య కెమెరాలు ఉన్నాయేమోననే దిశగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ దిశగా విచారణ, సోదాలు నేడు ప్రారంభించగా, తొలి రోజున 15 దుకాణాల్లో సెర్చ్ చేశామని, వీటిల్లో ఎటువంటి అనుమానిత కెమెరాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News