: ఆదిలాబాద్ మాజీ ఎంపీ మధుసూదన్‌రెడ్డి కన్నుమూత
ఆదిలాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు తక్కల మధుసూదన్ రెడ్డి (69) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన టీడీపీ అభ్యర్థి డాక్టర్ వేణుగోపాల రెడ్డిపై సుమారు 27 వేల ఓట్ల తేడాతో నెగ్గి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. 1946, జనవరి 14న జన్మించిన ఆయనకు భార్య లక్ష్మీ దేవితో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.