: 'మా' ఎన్నికల ఫలితాలు ఈ నెల 9కి వాయిదా


'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (మా) ఎన్నికల ఫలితాల వెల్లడిని హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు ఈనెల 9కి వాయిదా వేసింది. నటుడు, ఎంపీ మురళీమోహన్, అలీలు ఈ రోజు కౌంటర్ దాఖలు చేశారు. అయితే ఎన్నికల అధికారులను కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. 'మా' పోలింగ్ ప్రక్రియను తీసిన వీడియో రికార్డింగును అధికారులు గత నెల 31న కోర్టుకు సమర్పించారు. గత నెల 29న 'మా' అధ్యక్ష పదవికి పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. నటుడు రాజేంద్రప్రసాద్, నటి జయసుధ అధ్యక్ష పదవికి పోటీ చేశారు.

  • Loading...

More Telugu News