: శేషాచలం అడవుల్లో ఎన్ కౌంటర్ పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు జిల్లా పాలనాధికారి (కలెక్టర్) సిద్ధార్థ జైన్ ఆదేశించారు. విచారణాధికారిగా జిల్లా రెవిన్యూ అధికారి విజయ్ చందర్ ని నియమించారు. ఎన్ కౌంటర్ పై విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక అందించాలని కోరారు.