: నేటి నుంచి ఐపీఎల్ సంరంభం... ప్రారంభ వేడుకలకు వర్షం అడ్డంకి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో సీజన్ కు నేటి నుంచి తెరలేవనుంది. దేశీయ, విదేశీ ఆటగాళ్లతో కూడిన ఎనిమిది జట్ల మధ్య రసవత్తర పోరుతో ఐపీఎల్ విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ఎనిమిదో సీజన్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ స్టార్లు హంగామా చేయనున్నారు. అయితే నేటి సాయంత్రం కోల్ కతాలో జరగనున్న ప్రారంభ వేడుకలకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నట్లు సమాచారం. రేపు తొలి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు ఈ మ్యాచ్ లో తలపడనుంది.