: గోగులమ్మ జాతరలో గోల గోల... కొత్తపేట ఎమ్మెల్యే అరెస్ట్, పోలీసుల లాఠీచార్జి


తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో జరుగుతున్న గోగులమ్మ జాతరలో రాత్రి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. జాతరలో పోలీసులు అతి చేస్తున్నారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కొత్తపేట ఎమ్మెల్యే చర్ల జగ్గిరెడ్డి జాతర వద్దకు చేరుకుని గ్రామస్థులకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆకుల రామకృష్ణ కూడా గ్రామస్థులకు మద్దతు పలికారు. అయితే ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నేతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల చర్యను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకంటూ పోలీసులు గ్రామస్థులపై లాఠీలు ఝుళిపించారు. ఎమ్మెల్యే అరెస్ట్, పోలీసుల లాఠీ చార్జిలతో సంబరాల జాతరలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

  • Loading...

More Telugu News