: ఉపాధ్యాయురాలిపై ప్రధానోపాధ్యాయురాలి యాసిడ్ దాడి


సభ్యసమాజం ఆశ్చర్యపోయే సంఘటన తమిళనాట చోటుచేసుకుంది. చక్కని విద్యాబుద్ధులు చెప్పి, ఉన్నత సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన ప్రధానోపాధ్యాయురాలు వ్యక్తిగత కక్షతో సహ ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడికి పాల్పడింది. చెన్నై వలసరవాక్కంలో సియోన్ కిడ్స్ పార్క్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మంజూసింగ్ హెచ్ఎంతో ఉన్న విభేదాల కారణంగా, ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు పాఠశాలకు వెళ్లింది. రాజీనామా పత్రం సమర్పించేందుకు ప్రధానోపాధ్యాయురాలిని కలిసింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఫ్లోరాకు, మంజూసింగ్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన ఫ్లోరా అకస్మాత్తుగా మంజూసింగ్‌ పై యాసిడ్ పోసింది. తీవ్రగాయాల పాలైన ఆమెను పాఠశాల సిబ్బంది ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఫ్లోరాపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News