: ప్రయోగాలు చేస్తేనే ఫలితాలు వస్తాయి: ఇమ్రాన్ తాహిర్
ఐపీఎల్ సీజన్ 8కు జట్లన్నీ సన్నద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మాట్లాడుతూ, టీ20 ఫార్మాట్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని అన్నాడు. అయితే క్రీజులో ఉన్నంత సేపు ప్రయోగాలు చేస్తూ ఉండాలని తాహిర్ పేర్కొన్నాడు. ప్రయోగాలు చేస్తూ ఉంటే ఫలితాలు వస్తాయని ఆయన తెలిపాడు. భారత ఆటగాళ్లు స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటారు కనుక, ఫార్మాట్ కు తొందరగా అలవాటు పడాలని చెప్పాడు. వన్డే ఫార్మాట్, టీ20 ఫార్మాట్ కు చాలా తేడా ఉంటుందని తాహిర్ చెప్పాడు.