: బిగుతు బట్టలు మానండి, పాశ్చాత్య సంస్కృతి వదలండి... రేప్ లు తగ్గిపోతాయి: గోవా మంత్రి భార్య


గోవా మంత్రి దీపక్ ధవళికర్ భార్య లత వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. అత్యాచారాలు పెరగడానికి కారణం యువత పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడమేనని లత పేర్కొన్నారు. బొట్టుపెట్టుకోవడం, జడ వేసుకోవడం వంటివి అమ్మాయిలు మర్చిపోయారని ఆమె తెలిపారు. అంగాంగ ప్రదర్శన కోసం బిగుతైన దుస్తులు వేసుకుంటున్నారని ఆమె అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని అనుకరించే స్కూళ్లకు పిల్లలను పంపకుండా, విద్య నేర్పే స్కూళ్లకు పిల్లల్ని పంపాలని ఆమె సూచించారు. అలాగే ఫోన్ లో హలో, హాయ్ కు బదులుగా, నమస్కారం అనాలని ఆమె చెప్పారు. జనవరి ఫస్టుకు బదులు గుడిపడ్వాను నూతన సంవత్సరంగా చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News