: సెహ్వాగ్ గురించి చెప్పడానికి ఏమీ లేదు...అందరికీ తెలిసిందే: సంజయ్ బంగర్
టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తాడని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కోచ్ సంజయ్ బంగర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సెహ్వాగ్ ఆట గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదని, ఆయన గురించి అందరికీ తెలిసిందేనని అన్నాడు. టీమిండియాలో స్థానం సంపాదించే సత్తా సెహ్వాగ్ లో ఉందని ఆయన పేర్కొన్నాడు. ఫిట్ నెస్ కాపాడుకునేందుకు సెహ్వాగ్ శ్రమిస్తున్నాడని బంగర్ తెలిపాడు. ప్రాక్టీస్ లో సెహ్వాగ్ సత్తా చాటుతున్నాడని, మునుపటి ఫాం అందుకుంటే సెహ్వాగ్ ను ఆపడం సాధ్యం కాదని బంగర్ చెప్పాడు. కాగా, ఐపీఎల్ సీజన్ 8 ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది.