: భారత అమ్ముల పొదిలోకి స్కార్పీన్ జలాంతర్గామి
ముంబైలో తయారు చేసిన స్కార్పీన్ జలాంతర్గామి ఈ ఉదయం తొలిసారిగా జల ప్రవేశం చేసింది. ముంబయిలోని మజ్గాన్ డాక్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పాల్గొన్నారు. వివిధ రకాల పరీక్షల అనంతరం స్కార్పీన్ 2016లో నావికాదళంలోకి పూర్తి స్థాయిలో చేరనుంది. ఫ్రాన్స్ కు చెందిన డీసీఎన్ఎస్ సహాయంతో 6 స్కార్పీన్ ల తయారీ 2005లో ప్రారంభమైంది. తొలుత రూ. 5 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టగా, ఇప్పుడది రూ. 23 వేల కోట్లకు చేరింది. ఇకపై ప్రతి 9 నెలలకు ఓ స్కార్పీన్ జలాంతర్గామిని నావికాదళానికి అందిస్తామని ఈ సందర్భంగా పారికర్ వివరించారు.