: నీళ్లలోకి దూకి, అమ్మాయిని కాపాడిన న్యాయమూర్తి


పేదరికం మూలంగా చదువుకు దూరమైన ఓ బాలిక, మనస్తాపంతో సరస్సులో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, అటుగా వెళ్తున్న ఒక న్యాయమూర్తి ఆమెను కాపాడారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హర్యానాలో జరిగింది. వివరాల్లోకి వెళితే... పంజాబ్, హర్యానా రాష్ట్రాల హైకోర్ట్ జడ్జి జస్టిస్ జైపాల్ తన సెక్యూరిటీ ఆఫీసర్ యశ్ పాల్ తో కలిసి సుఖానా సరస్సు ఒడ్డున వాకింగ్ చేస్తుండగా 'హెల్ప్ హెల్ప్' అని అరుపులు వినిపించాయి. ఒక బాలిక సరస్సులో మునిగిపోవడాన్ని చూసిన జైపాల్, ఆమెను రక్షించడానికి సరస్సులోకి దూకారు. ఆయనతో పాటే యశ్ పాల్ కూడా ఆమెను కాపాడేందుకు దూకారు. ఇద్దరూ మునిగిపోతున్న బాలిక కోసం వెతుకులాడి ఆమెను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి జారుకున్న బాలికకు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం విషయం తెలుసుకున్న న్యాయమూర్తి బాలిక చదువుకు సహాయం చేయడమే కాకుండా, ఆమెను రక్షించడంలో సహకరించిన సెక్యూరిటీ అధికారికి నగదు పురస్కారం అందించి ప్రమోషన్ ఇవ్వాలని రికమండ్ చేశారట.

  • Loading...

More Telugu News