: ఉస్మానియా హాస్టలులో ఫుడ్ పాయిజన్... ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి విషమం
హైదరాబాదులోని ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీలోని నర్సింగ్ హాస్టలులో ఫుడ్ పాయిజన్ జరుగగా, సుమారు 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నేటి ఉదయం జరిగింది. బాధితులను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టల్ వంటగది అపరిశుభ్రంగా ఉండడం, కుళ్లిపోయిన కూరగాయలు వాడటం ఫుడ్ పాయిజన్‌కు కారణమని విద్యార్థినులు ఆరోపించారు. తగిన ప్రమాణాలు పాటించకుండా భోజనాలు సిద్ధం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.