: సానియా జోడీకి మరో టైటిల్... మియామీ ఓపెన్ లో జయకేతనం
టెన్నిస్ లో ఒకనాటి సంచలనం మార్టినా హింగిస్ తో జతకట్టిన తర్వాత భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విజయ పరంపర కొనసాగిస్తోంది. కొద్దిసేపటి క్రితం ముగిసిన మియామీ ఓపెన్ ఫైనల్ లో సానియా-మార్టినా జోడి విజయ దుందుభి మోగించింది. రష్యాకు చెందిన ఎలెనా వెస్నినా-ఎకతెరినా మకరోవా జోడీపై 7-5, 6-1 స్కోరుతో సానియా జోడీ విజయం సాధించింది. ప్రారంభం నుంచే మ్యాచ్ పై పట్టు సాధించిన సానియా జోడీ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేయడం గమనార్హం. రెండు వారాల క్రితం జరిగిన ఇండియా వెల్స్ టోర్నీలోనూ సానియా జోడీ టైటిల్ ను ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే.