: బీజేపీ ఎమ్మెల్యేను చెంప దెబ్బకొట్టిన యువకుడు
బీజేపీ కంచుకోట గుజరాత్ లో ఓ బీజేపీ ఎమ్మెల్యేను చెంప దెబ్బకొట్టాడో యువకుడు. వివరాల్లోకి వెళ్తే... హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ ఎమ్మెల్యే భరత్ పటేల్ తన స్వగ్రామం పార్నెరపండికి చేరుకున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న కిశోర్ పటేల్ అనే యువకుడు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని పేర్కొంటూ ఎమ్మెల్యే చెంపపై లాగి ఒకటిచ్చుకున్నాడు. దీంతో చుట్టూ ఉన్నవాళ్లు యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యువకుడు కొట్టిన దెబ్బకు ఎమ్మెల్యే కంటికి గాయమైంది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కిశోర్ తన ఇంటి సమీపంలోనే ఉంటాడని, అతనికి మతిస్థిమితం లేదని అన్నారు.