: వాళ్లిద్దరూ జైలు నుంచి పారిపోయిన వారే: ఎంపీ పోలీసుల నిర్థారణ


నల్గొండ జిల్లా జానకీపురంలో జరిగిన పోలీస్ ఎన్ కౌంటర్ లో మృతి చెందినది సిమి ఉగ్రవాదులేనని మధ్యప్రదేశ్ పోలీసులు నిర్ధారించారు. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు నార్కట్ పల్లి చేరుకున్నారు. నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. ఖాండ్వా జైలు రికార్డులలో నమోదు చేసిన ఉగ్రవాదులు ఫింగర్ ప్రింట్స్ తో సరిపోతున్నాయో లేదో పోల్చిచూశారు. సరిపోవడంతో వీరు సిమి ఉగ్రవాదులేనని వారు స్పష్టం చేశారు. 2013 అక్టోబర్ 1 అర్ధరాత్రిన ఖాండ్వా జైలులో వెంటిలేటర్ పగులగొట్టి, దుప్పట్లను తాడుగా చేసి, 16 అడుగుల జైలు గోడల్ని దూకి తప్పించుకుపోయారని వారు తెలిపారు. దీంతో వీరు సిమి ఉగ్రవాదులేనని తేటతెల్లమైంది. ఇక మిగిలిన వారు ఎక్కడున్నారు? అనే విషయం తేలాల్సి ఉంది. దీనిపై నిఘావర్గాలు తీవ్రంగా శోధిస్తున్నాయి.

  • Loading...

More Telugu News