: కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు శుభవార్త... నరైన్ పాస్


ఐపీఎల్ సీజన్8లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్ విభాగం పటిష్టం కానుంది. బీసీసీఐ సూచన మేరకు వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ కు నిర్వహించిన అన్ని పరీక్షల్లో సఫలీకృతుడయ్యాడు. బౌలింగ్ విధానంలో లోపం ఉందంటూ ఐసీసీ గతంలో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణుడైన నరైన్ కు మరోసారి పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ ఆదేశించింది. దీంతో అతనికి నిపుణులు పరీక్షలు నిర్వహించారు. అతని బౌలింగ్ యాక్షన్ పై ఎలాంటి అనుమానం వ్యక్తం చేయని నిపుణులు, అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో సునీల్ నరైన్ ను ఐపీఎల్ లో చూడబోతున్నామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

  • Loading...

More Telugu News