: అర్వపల్లి సమీప ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందం తనిఖీలు
నల్గొండ జిల్లాలో సిమి ఉగ్రవాదులు హతమైన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. హతులను నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమికి చెందన వారుగా గుర్తించిన ఎన్ఐఏ, వారికి సంబంధించిన ఇతర వివరాలు సేకరించేందుకు నడుం బిగించింది. ఈ నేపథ్యంలో వారి సహచరుల ఆనవాళ్ల కోసం వెతుకులాట ప్రారంభించింది. కాగా, మధ్యప్రదేశ్ లోని కాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఐదుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరిని నల్గొండ జిల్లా పోలీసుల మట్టుబెట్టగా, మరో ముగ్గురి ఆచూకీ కోసం తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తి ఈ ఉదయం తిరుగాడినట్టు, అతను హిందీలో మాట్లాడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో, అతని కోసం పోలీసులు మరోసారి జల్లెడపట్టడం ప్రారంభించారు.