: త్వరలో అందుబాటులోకి తేలికైన ప్లాస్టిక్ కార్లు


త్వరలో తేలికగా ఉండే ప్లాస్టిక్ కార్లను అందుబాటులోకి తేనున్నామని జర్మన్ శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికోసం ప్రొటోటైప్ ఇంజిన్ రూపొందించారు. ఇంజిన్ కు కావాల్సిన ఇతర విడి భాగాలన్నీ ప్లాస్టిక్ తో రూపొందించడం విశేషం. దీంతో కారు బరువులో విశేషమైన మార్పు చోటుచేసుకోనుంది. అంతే కాకుండా ఇంధన వినియోగం కూడా తగ్గనుంది. జర్మనీలోని ప్రానోఫర్ ప్రాజెక్టు గ్రూప్ న్యూ డ్రైవ్ సిస్టమ్ కు చెందిన పరిశోధకులు ఈ కొత్త ఇంజిన్ రూపొందించారు. సాధారణ కార్లను రూపొందించేవారు బరువును నియంత్రించేందుకు అల్యూమినియం వాడుతున్నారు. గ్యాస్ సిలిండర్ ఉండే స్థానంలో దీని వినియోగం అధికంగా ఉంటుంది, దాని స్థానంలో అంతే సామర్థ్యంతో పని చేసేలా దృఢపరిచిన ప్లాస్టిక్ ఫైబర్ వినియోగించినట్టు వారు తెలిపారు. దీని బరువు అల్యూమినియంతో పోల్చుకుంటే కేవలం 20 శాతమే ఉంటుందని వారు వెల్లడించారు. దీంతో కార్ల తయారీలో విశేషమైన మార్పులు చోటుచేసుకుంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News