: రూ.5 కోట్ల స్థలాన్ని మాజీ మంత్రి లాక్కున్నారు... బెజవాడలో ధర్నాకు దిగిన దంపతులు
రూ.5 కోట్ల విలువైన తమ భూమిని ఓ మాజీ మంత్రి లాక్కున్నారని ఆరోపిస్తూ కొద్దిసేపటి క్రితం బెజవాడలో ఓ దంపతులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ మంత్రి పార్థసారధి తమ భూమిని లాక్కున్నారని ఆరోపిస్తున్న వారు, కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, మాజీ మంత్రి తమ భూమిని వదలడం లేదని వాపోతున్నారు. తమకు జీవనాధారమైన భూమిని తమకు తిరిగి ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రిపై భూకజ్జా ఆరోపణలు చేస్తూ దంపతులు ఆందోళనకు దిగిన విషయం నగరంలో కలకలం రేపుతోంది.