: రాజు వెడలె రవితేజములలరగ...దుబాయ్ రాజు తీరు!


'రాజు వెడలె రవి తేజములలరగ' అన్నట్టు దుబాయ్ రాజు ఎక్కడికెళ్లినా మందీమార్బలంతో బయలుదేరతాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ కు ప్రధానమంత్రిగా, ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దుబాయ్ యువరాజు షేక్ మొహమ్మద్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆయన లండన్ లో తనకో భవనం ఉండాలని సంకల్పించారు. తన 23 మంది పిల్లలు, కుటుంబ సభ్యులు లండన్ వెళ్లాలని భావిస్తే, వారు ఇబ్బందులు పడకుండా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. థేమ్స్ నది ఒడ్డున బ్యాటర్‌ సీ హెలిపోర్టు పక్కన అద్భుతమైన భవనాన్ని నిర్మిస్తున్నారు. అక్కడే కార్ల పార్కింగ్ కోసం దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చుతో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. కేవలం కార్ల పార్కింగ్ కోసం భూగర్భంలో రెండు ఫోర్లు, భూ ఉపరితలంపై ఆరు అంతస్తులు, ఆపైన కార్ల డ్రైవర్లు, ఇతర సిబ్బంది కోసం ఐదు నక్షత్రాల హోటల్ వసతులతో అందమైన భవనాన్ని ఆయన నిర్మిస్తున్నారు. కాగా, రాజుగారు ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట వ్యక్తిగత సిబ్బంది మరో 114 కార్లలో వెంబడిస్తారు. దీంతో సుమారు 120 కార్ల రాకపోకల రొదతో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరుగు, పొరుగువారు స్థానిక కౌంటీ మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పట్టించుకోని మున్సిపాలిటీ, దుబాయ్ యువరాజు భవన ప్లాన్‌ కు అవసరమైన అనుమతులు ఇచ్చింది. జుమీరా లగ్జరీ హోటళ్ల గ్రూప్ అధిపతి కూడా అయిన దుబాయ్ యువరాజుకు లండన్‌ లో బ్రాంచ్‌ హోటల్, లగ్జరీ వసతి గృహాలు లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News