: ముంబై ఇండియన్స్ తో కలిసిన షేన్ బాండ్
ఐపీఎల్ సీజన్8 లో ముంబై ఇండియన్స్ జట్టుతో షేన్ బాండ్ కలిశాడు. న్యూజిలాండ్ అగ్రశ్రేణి బౌలర్ గా వెలుగొందిన షేన్ బాండ్ 2010లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ గా కొత్త అవతారమెత్తిన షేన్ బాండ్, వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న జట్టుతో కలిశాడు. కాగా, ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా రికీ పాంటింగ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన వీరిద్దరూ కలసి పని చేయడం విశేషం. రికీ పాంటింగ్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని షేన్ బాండ్ తెలిపాడు.